సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. సంజయ్ రావ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సంజయ్ రావ్ గాయాలతో, తీవ్రమైన లుక్‌లో కనిపించి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.
శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌లపై సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఈ చిత్రంలో కిరీటి, మురళీధర్ గౌడ్, లిరీషా కునపరెడ్డి, రవి ప్రకాష్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ హెన్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ భాస్కర్ సద్దాల, ఎల్ గంగాధర్ సినిమాటోగ్రాఫర్లుగా, డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


