రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సంజు’. విడుదలైన రోజునుండి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తు మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి రూ. 250 కోట్ల క్లబ్ లో చేరనుంది.
ఇక తన కథతో సినిమా తీసినందుకు సంజయ్ దత్ కు భారీ గా ముట్టజెప్పారట. చిత్ర ప్రారంభానికి ముందే చిత్ర దర్శకుడు ,ఆయన స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీ 10 కోట్ల అడ్వాన్ ఇచ్చారని ఇక ఈ చిత్రం విడుదలయ్యాక లాభాల్లో కూడా వాటా ఇస్తామని హామీ ఇచ్చారట. దాంతో ఇప్పుడు సంజయ్ దత్ మరో 20 కోట్ల దాకా అందుకోనున్నారని సమాచారం. యువ హీరో రణబీర్ కపూర్ నటన ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించటం లో కీలక పాత్ర పోషించింది .
