సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ : రియల్ టెస్ట్ మొదలయ్యేది అప్పటి నుండే

సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ : రియల్ టెస్ట్ మొదలయ్యేది అప్పటి నుండే

Published on Jan 17, 2024 2:12 AM IST

తాజాగా సంక్రాంతి కి మొత్తంగా రిలీజ్ అయిన నాలుగు తెలుగు సినిమాలు ప్రస్తుతం ఈ సీజన్ లో బాగానే కలెక్షన్ తో కొనసాగుతున్నాయి. వీటిలో సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ ల గుంటూరు కారం, నాగార్జున విజయ్ బిన్నీ ల నా సామిరంగ, వెంకటేష్ శైలేష్ కొలను ల సైంధవ్, తేజ సజ్జ ప్రశాంత్ వర్మ ల హను మాన్ ఉన్నాయి.

అయితే వీటిలో ప్రస్తుతం కొంత పైచేయిగా హను మాన్ మూవీ కొనసాగుతుంది అనేది వాస్తవం. కాగా వీటికి అసలు బాక్సాఫీస్ టెస్ట్ ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. రేపటి ముక్కనుమతో అందరి సెలవలు ముగియనున్నాయి. అక్కడి నుండి వీటికి వచ్చే కలెక్షన్ ని బట్టి ఏది ఒకింత పైచేయిగా ఉంటుందో తెలుస్తుందని, ఆపై చివరిగా టోటల్ క్లోజింగ్ కలెక్షన్ ప్రకారం ఏది సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ విన్నర్ అనేది కూడా తేటతెల్లం అవుతుందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు