సంక్రాంతి బాక్సాఫీస్ : హౌస్ ఫుల్స్ తో కళకళలాడుతున్న థియేటర్స్

సంక్రాంతి బాక్సాఫీస్ : హౌస్ ఫుల్స్ తో కళకళలాడుతున్న థియేటర్స్

Published on Jan 15, 2024 8:07 PM IST

ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో మొత్తంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం, జనవరి 13న సైంధవ్, జనవరి 14న నా సామిరంగ ఆడియన్స్ ముందుకి వచ్చాయి. అయితే వీటిలో హను మాన్ మంచి టాక్ అందుకోగా గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

విషయం ఏమిటంటే, నిన్న భోగి సందర్భంగా ఈ నాలుగు సినిమాలు మంచి కలెక్షన్ అందుకోగా, నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపుగా అనేక ఏరియాల్లో ఈ నాలుగు సినిమాలు హౌస్ ఫుల్స్ తో రన్ అవుతున్నట్లు తాజా ట్రేడ్ విశ్లేషకుల బజ్. అలానే రేపు కనుమ, ఎల్లుండి ముక్కనుమ కావడంతో ఆ రెండు రోజులు కూడా ఈ సినిమాలకు మంచి కలెక్షన్ లభించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా వీటిలో హను మాన్ అన్నిటికంటే మంచి టాక్, కలెక్షన్ తో నడుస్తున్నప్పటికీ పక్కాగా సంక్రాంతి విజేత ఎవరనేది తెలియాలి అంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే అని వారు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు