ఇంట్రెస్టింగ్‌గా ‘సత్తిబాబు పరలోక యాత్ర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. సంతోష్ శోభన్ నుంచి మరో ఎంటర్‌టైనర్.!

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సత్తిబాబు పరలోక యాత్ర’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన ధరించిన సన్‌గ్లాసెస్‌లో ఒకవైపు హిందూ దేవాలయం, మరోవైపు క్రిస్టియన్ చర్చి ప్రతిబింబిస్తూ రెండు వేర్వేరు ప్రపంచాలను ఆవిష్కరిస్తున్నాయి.

తెలుగు సినిమాలో తొలిసారిగా వస్తున్న ఈ ‘మల్టీవర్స్ కామెడీ ఎంటర్‌టైనర్’ కాన్సెప్ట్ కథలోని అసలు మిస్టరీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచేసింది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ వంటి హిట్ తర్వాత సంతోష్ శోభన్, దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో ఎఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు పి, సందీప్ ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రీతి అస్రాని, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version