కామెడీ ప్రధాన హైలైట్ గా రానున్న ‘కొత్త జంట’

Kotha_Janta (7)
‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాతో వరుస హిట్స్ అందుకున్న మారుతి దర్శకత్వంలో రానున్న మూవీ ‘కొత్త జంట’. అల్లు శిరీష్, రెజీనా, మధురిమ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మే 1న భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్దమవుతోంది. మామూలుగా మారుతి సినిమా అంటే కావలసినంత కామెడీ ఉంటుంది.

మాకు అందిన సమాచారం ప్రకారం ‘కొత్త జంట’లో కూడా కావలసినంత కామెడీ ఉండనుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తే, సెకండాఫ్ లో బినామి పాత్ర పొశించిఅన్ పోసాని కృష్ణ మురళి బాగా నవ్వించనున్నాడు. వీరిద్దరి కామెడీతో పాటు క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సమాచారం.

గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మించాడు. అల్లు శిరీష్ ‘కొత్త జంట’ తో హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు.

Exit mobile version