ధనుష్ “రాయన్” లో శరవణన్!

ధనుష్ “రాయన్” లో శరవణన్!

Published on Feb 27, 2024 10:36 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రాయన్. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జే. సూర్య, ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్, అపర్ణ బాల మురళి, వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఈ చిత్రం నుండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో శరవణన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ తో సినిమా హాట్ టాపిక్ గా మారుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు