అర్దరాత్రి నుంచే మొదలైన పవన్ ‘సర్దార్’ సందడి

Sardaar-Gabba-Singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతాగానో ఎదురు చూసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గత రాత్రి 12 గంటలకి రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినప్పటి నుంచే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా అందరి మాట్లాడుకునే హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని కనిపించిన పవన్ సెకండ్ పోస్టర్ లో బులెట్ బైక్ పై గన్ తో షూట్ చేస్తూ వస్తున్నాడు. అదే ఫస్ట్ టీజర్ లో పవన్ కళ్యాణ్ గుర్రంతో పాటు నడుచుకుంటూ వస్తూ గబ్బర్ సింగ్ మార్క్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ చూపించిన మానరిజమ్స్ అభిమానులని బాగా ఆకట్టుకుంటున్నాయి.

వీటికి మించి దేవీశ్రీ ప్రసాద్ ఈ చిన్న టీజర్ కి అందించిన మ్యూజిక్ బిట్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఒక విజిల్ తో మొదలు పెట్టిన దేవీశ్రీ గబ్బర్ సింగ్ విజిల్ ట్రాక్ తో ఫినిష్ చేయడం సూపర్బ్. ఇప్పటికే చాలా మంది ఈ మ్యూజిక్ బిట్ ని తన రింగ్ టోన్ గా కూడా మార్చేసుకున్నారు. అర్ధరాత్రి నుంచే సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి బాబీ డైరెక్టర్. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మరో మూడు రోజుల్లో హైదరాబాద్ లో మొదలు కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version