నైజాంలో “సర్దార్”, “ప్రిన్స్” లేటెస్ట్ వసూళ్లు డీటెయిల్స్.!

ఈ నెలలో టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో ఒకే వారం మూడు కంటే ఎక్కువ సినిమాలు దీపావళి కానుకగా వచ్చినవి కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో డబ్బింగ్ చిత్రాలు కూడా ఉండగా వాటిలో కార్తీ నటించిన “సర్దార్” అలాగే శివ కార్తికేయన్ నటించిన చిత్రం “ప్రిన్స్” కూడా ఒకటి. మరి ఈ రెండు చిత్రాలు కూడా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకోగా ఇప్పుడు రెండో వారం రెండో రోజుకి చేరుకున్నాయి.

ఇక నైజాం లో ఈ రెండు సినిమాల వసూళ్లు చూసినట్టు అయితే ఈ 15వ రోజున సర్దార్ 45 లక్షల నెట్ వసూళ్లు అందుకొని స్ట్రాంగ్ హోల్డ్ కనబరచగా మొత్తం 4.5 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ప్రిన్స్ అయితే ఈ వారాంతంలో 7.5 లక్షల నెట్ వసూళ్లు అందుకోగా మొత్తం ఇప్పటి వరకు 1.85 కోట్ల షేర్ ని అందుకుంది. మొత్తానికి అయితే ఈ రెండు చిత్రాలు ఇలా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇక సర్దార్ చిత్రానికి పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా ప్రిన్స్ ని అనుదీప్ తెరకెక్కించాడు.

Exit mobile version