‘సరిలేరు నీకెవ్వరు’.. షూటింగ్ పూర్తయింది !

sarileru 4

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. కాగా ఈ సినిమా ఈ రోజుతో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్రబృందం ట్వీట్ చేసింది. ‘జూలై 5న ప్రారంభించిన మా చిరస్మరణీయమైన షూటింగ్ ప్రయాణాన్ని, ఈ రోజు డిసెంబర్ 18న పూర్తి చేశాము. ‘సరిలేరు నీకెవ్వరు’తో ఈ సంక్రాంతి సినీ ప్రేమికులతో పాటు అభిమానులందరికీ గుర్తుండిపోతుంది’ అని పోస్ట్ చేశారు.

మొత్తానికి ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version