యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ లో దుమ్మురేపిన మహేష్

యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ లో దుమ్మురేపిన మహేష్

Published on Jan 11, 2020 8:22 AM IST

Sarileru Neekevvaru 2

మహేష్ సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు నేడు విడుదలైంది. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోల ప్రదర్శన జరుగగా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కాగా యూఎస్ ప్రీమియర్స్ నందు మహేష్ సరిలేరు నీకెవ్వరు దుమ్మురేపుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరు యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $ 620,000 లక్షలు వసూలు చేసింది. అక్కడ రాత్రి పూర్తయ్యే నాటికీ ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు. అంటే ప్రీమియర్ షోస్ ద్వారానే సరిలేరు నీకెవ్వరు మూవీ వన్ మిలియన్ వసూళ్లకు చేరువ అవుతుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ శాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, రావు రమేష్ వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించగా దేవిశ్రీ సంగీతం అందించారు.

తాజా వార్తలు