“సరిలేరు నీకెవ్వరు” లో మహేష్ సైనికుడా …?

Published on May 31, 2019 3:38 pm IST

మహేష్ 26 టైటిల్ పై రకరకాల ఊహాగానాలకు తెరదింపుతూ “సరిలేరు నీకెవ్వరు” నే ఫైనల్ చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ పై అనేక పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యాక్షన్ కథ అని. దీనిలో నిజమెంత ఉందో తెలియదు కానీ, టైటిల్ డిజైన్ చూస్తే ఈ మూవీ కథపై ఇంకొన్ని అనుమానాలు కలుగకమానవు.

“సరిలేరు నీకెవ్వరు” టైటిల్ ని బాగా పరిశీలిస్తే దేశసరిహద్దు కంచె,టైటిల్ చివర సిపాయి టోపీ తగిలించిన ఏ కే 47 గన్ ఉంది. అంటే సినిమాలో కొంత భాగం ఇండియా బోర్డర్ లో విధులు నిర్వహించే సైనికునిగా మహేష్ కనిపిస్తాడా అనే అనుమానాలు వస్తున్నాయి. టైటిల్ ని ఇలా సరిహద్దు కంచె, సిపాయి టోపీ, ఆయుధంతో డిజైన్ చేయడం వెనుక కారణం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More