“సరిపోదా శనివారం” టీజర్ రన్ టైం ఫిక్స్!

“సరిపోదా శనివారం” టీజర్ రన్ టైం ఫిక్స్!

Published on Feb 24, 2024 10:24 AM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ 1:25 నిమిషాల నిడివి ను కలిగి ఉంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్ట్ లో వెల్లడించారు. ఈరోజు ఉదయం 11:59 గంటలకు ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

నాని చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తుండటం తో సినిమాపై అభిమానులలో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో తమిళ నటుడు, డైరెక్టర్ SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు