తమిళ నాడులో రికార్డు సృస్టించిన సర్కార్ !

తమిళ నాడులో రికార్డు సృస్టించిన సర్కార్ !

Published on Nov 9, 2018 9:12 PM IST

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం ఇటీవల విడుదలై తమిళ నాడులో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రం మూడు రోజులకుగాను అక్కడ సుమారు 63కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదికి తమిళ నాడులో ఇదే అత్యధిక గ్రాస్ కావడం విశేషం.

ఇక ఈ చిత్రం తెలుగులో 3రోజులకుగాను 5కోట్ల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసి ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70శాతం రికవరీ చేసింది. ఇంకో రెండు కోట్లు రాబడితే ఈచిత్రం ఇక్కడ బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నట్లే. ఎఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈచిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు