సర్కార్ రికార్డు కలక్షన్లను రాబట్టింది అయినా కూడా .. !

సర్కార్ రికార్డు కలక్షన్లను రాబట్టింది అయినా కూడా .. !

Published on Nov 25, 2018 5:18 PM IST

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం దీపావళి రోజున విడుదలై భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగులో ఈచిత్రం డివైడ్ టాక్ ను తెచ్చుకోగా తమిళంలో మాత్రం మంచి టాక్ ను తెచ్చుకుంది దానికి తగ్గట్లే కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పటివరకు తమిళనాడులో ఈచిత్రం 70 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇంతకుముందు విజయ్ నటించిన ‘మెర్సల్’ అలాగే రాజమౌళి ‘బాహుబలి’ చిత్రాలు మాత్రమే అక్కడ ఈ ఫీట్ ను సాధించాయి.

అయితే సర్కార్ ఈ రేంజ్ లో కలక్షన్లను రాబట్టిన కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్ లకు నష్టాలనే మిగిల్చింది. ఈచిత్రం అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ లో 90 శాతం మాత్రమే వెనక్కు తేగలిగింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లకు 10శాతం నష్టాలను మిగిల్చింది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు