సర్కార్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది !

సర్కార్ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది !

Published on Nov 7, 2018 12:10 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ చిత్రం నిన్న విడుదలై కలక్షన్ల పరంగా చాలా ఏరియాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.తమిళనాడు వ్యాప్తంగా ఈచిత్రం మొదటి రోజు రూ.32కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇప్పటివరకు అక్కడే ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.

ఇక ఈచిత్రం తెలుగులో మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకున్న తెలంగాణ మరియు ఏపీ ల్లో మొదటి రోజు రూ. 2.32కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. విజయ్ కి తెలుగులో ఇదే బెస్ట్ ఓపెనింగ్. ఇక ఈచిత్ర తెలుగు వెర్షన్ 7కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. మరి ఫుల్ రన్ లో ఆ మొత్తాన్ని రాబడుతుందో లేదో చూడాలి. అయితే మరో వారం రోజుల వరకు తెలుగులో పెద్ద సినిమా ల రిలీజ్ లేకపోవడం ఈచిత్రానికి కలిసివచ్చే అంశమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు