సర్కార్ రెండు రోజుల్లోనే 100కోట్లు క్లబ్ లో చేరింది !

సర్కార్ రెండు రోజుల్లోనే 100కోట్లు క్లబ్ లో చేరింది !

Published on Nov 8, 2018 8:43 AM IST

ఇళయదళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం కలక్షన్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ఫలితంగా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసిందని సమాచారం. ఇక నిన్న సెలవు రోజు కావడం ఈచిత్రానికి చాలా కలిసి వచ్చింది.

ఇక ఈ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. సుమారు గా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఆ మొత్తాన్ని రాబట్టడం ఖాయం గా కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు