మొదటి రోజు చెన్నై లో రికార్డు సృష్టించిన సర్కార్ !

మొదటి రోజు చెన్నై లో రికార్డు సృష్టించిన సర్కార్ !

Published on Nov 7, 2018 9:22 AM IST

తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సర్కార్ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైయింది. ఈ చిత్రం తమిళంలో కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. మొదటి రోజు ఈ చిత్రం చెన్నై లో రూ. 2.37కోట్ల వసూళ్లను రాబట్టి అంతకుముందు వున్నా రికార్డును క్రాస్ చేసింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో విజయ్ వన్ మ్యాన్ షో చేశాడు. దాంతో ఈచిత్రం అయన అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తెలుగులో ఈచిత్రానికి మిక్సడ్ రివ్యూస్ రావడంతో ఇక్కడ ఎంత మేరకు వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

మురుగదాస్ తెరకెక్కించిన ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు