రికార్డుల ‘వేలం పాట’లో ‘సర్కారు వారి పాట’!

Published on Jun 1, 2020 12:21 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’లో లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో స్టైలిష్ లుక్ లో ముందెప్పుడూ చూడని మాస్ లుక్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాడు. కాగా ఈ ఫ్రీ లుక్ పోస్టర్ రికార్డుల ‘వేలం పాట’ మొదలు పెట్టింది. 24 గంటల్లో మోస్ట్ రీట్వీట్ చేసిన ప్రీ లుక్ ఇదే, అలాగే మోస్ట్ లైక్స్ వచ్చిన ప్రీ లుక్ కూడా ఇదే, అదే విధంగా మోస్ట్ ట్వీట్ చేసిన యాష్ ట్యాగ్ కూడా ఇదే కావడం విశేషం.

మొత్తానికి సర్కారు వారి పాట టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండు అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో విరుచుకుపడుతున్నారు. దీనితో దేశంలోనే తక్కువ టైములో వన్ మిలియన్ ట్వీట్స్ చేసిన టైటిల్ ట్యాగ్ గా కూడా సర్కారు వారి పాట నిలిచింది. ఇక ‘సర్కారు వారి పాట’ సినిమాలో మెయిన్ థీమ్ గురించి మహేష్ స్పందిస్తూ.. ‘ఈ సినిమా స్ట్రాంగ్ మెసేజ్ తో సాగే ఫుల్ ఎంటర్ టైనర్. నిజంగా ఈ సినిమా పై నేను చాల ఆసక్తిగా ఉన్నాను’ అని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More