మహేష్ హిట్టుకొట్టడం..కీర్తికి చాలా అవసరం.

మహేష్ హిట్టుకొట్టడం..కీర్తికి చాలా అవసరం.

Published on Jun 19, 2020 3:32 PM IST

mahesh keerthy

కీర్తి సురేష్ కి తెలుగులో స్టార్ హీరోల పక్కన అవకాశం రావడం కష్టమే అని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కనున్న సర్కారు వారి పాట మూవీలో హీరోయిన్ గా చేస్తున్నట్లు కీర్తి కన్ఫర్మ్ చేశారు. తన లేటెస్ట్ మూవీ పెంగ్విన్ విడుదల సంధర్భంగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన కీర్తి సురేష్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

మరి ఈ సినిమా హిట్టైతే కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఈ మూవీ అటూ ఇటూ అయితే మాత్రం ఆమె ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పరిమితం కావలసిందే. కాబట్టి సర్కారు వారి పాట మూవీ విజయం ఆమెకు చాలా అవసరం. ఈ చిత్రంలో మహేష్ సరికొత్త గెటప్ మరియు రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు