“సర్కారు వారి పాట” సాలిడ్ అప్డేట్ అప్పటికి ఫిక్స్!

“సర్కారు వారి పాట” సాలిడ్ అప్డేట్ అప్పటికి ఫిక్స్!

Published on Feb 18, 2021 1:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం అంతే సాలిడ్ గా తెరకెక్కుతుంది కూడా..మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇస్తూనే ఉన్నాడు.

ఇది వరకు వీరిద్దరి నుంచి వచ్చిన ఆడియో ఆల్బమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని భారీ రెస్పాన్స్ నే తెచ్చుకున్నాయి. దీనితో ఈ చిత్రంపై కూడా అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే థమన్ కూడా వర్క్ చేస్తున్నాని చెప్తున్నాడు. అయితే మరి ఈ సినిమా ఫస్ట్ సింగిలో మరే ఇతర సాలిడ్ ఆడియో అప్డేట్ మాత్రం వచ్చే ఆగస్ట్ లోనే ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసాడు థమన్. అప్పుడు ఎలాగో మహేష్ బర్త్ డే ఉంది కాబట్టి అప్పటికి ప్లాన్ చేసి ఉండొచ్చు. మరి ఆ అప్డేట్ ఏంటి అన్నది తెలియాలి అంటే అప్పటి వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు