ప్లానింగ్ లేకుండానే వాయిస్తున్న మహేష్ ఫ్యాన్స్.!

Published on Jan 22, 2021 8:00 am IST

మన దక్షిణాది స్టార్ హీరోలకు ఉన్నటువంటి అభిమానులు మరెవరికీ ఉండరని చెప్పాలి. అయితే ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరని చెప్పాలి. మహేష్ పేరిట ఎన్నెన్నో సెన్సేషనల్ రికార్డులను తన ఫ్యాన్స్ నమోదు చేశారు ఇప్పటికీ నమోదు చేస్తూనే ఉన్నారు. మరి అలా ఇప్పుడు తాను చేస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” హ్యాష్ ట్యాగ్ తో పెద్దగా సందర్భం లేకుండానే నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేసేస్తున్నారు.

లక్షకు పైగా ట్వీట్స్ తో ట్విట్టర్ లో సర్కారు వారి పాట ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ట్రెండ్ ఎలాంటి ప్లానింగ్ లేకుండానే జరుగుతుంది. అలాగే ప్లాన్ చేసి ట్రెండ్ చేస్తే అది ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. ఇపుడు దీనితో పాటుగా ఇదే కొనసాగితే సర్కారు వారి పాట ట్యాగ్ 100 మిలియన్ మార్క్ ను అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమా బహుశా వరల్డ్ సినిమాగా మరో రికార్డు ను సెట్ చెయ్యొచ్చు. ప్రస్తుతానికి 90 మిలియన్ కు పైగా హ్యాష్ ట్యాగ్స్ పడ్డాయి. మరి ఆ సెన్సేషనల్ రికార్డును ఎప్పుడు నమోదు చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More