మహేష్ రివేంజ్ తీర్చుకుంటాడట.

Published on Jun 2, 2020 11:52 am IST

ఫస్ట్ లుక్ పోస్ట్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మహేష్ అండ్ టీమ్. సర్కారు వారి పాట టైటిల్ మరియు మహేష్ ఫస్ట్ లుక్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. ఇక ఈ టైటిల్ లోగో అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర స్టోరీ లైన్ పై మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది.

ఈ చిత్రం బ్యాంకింగ్ వ్యవస్థల లోపాలను, ఫ్రాడ్స్ ఎత్తిచూపే సెటైరికల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా, ఓ ఆసక్తికర స్టోరీ లైన్ సైతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. బ్యాంకు ఫ్రాడ్ కారణంగా అన్యాయానికి గురైన యువకుడు, దానికి కారణమైన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది, ఈ సినిమా బేసిక్ ప్లాట్ అని తెలుస్తుంది. మరి ఈ స్టోరీ లైన్ గమనిస్తే ఇది ఓ రివేంజ్ డ్రామా అయ్యే అవకాశం కలదు.

దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More