
తెలుగు, తమిళ భాషలలో రీమేక్ కానున్న ‘బెంగళూరు డేస్’ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఒకప్పటి ప్రేమజంట సిద్దార్ధ్, సమంత నటిస్తారని మొదట ప్రచారం జరిగింది. బ్రేక్ అప్ అయిన తర్వాత వీరిద్దరూ ఆ సినిమాలో నటించడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. దాంతో, హీరో హీరోయిన్ల ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది.
ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. శర్వాకు తెలుగు, తమిళ భాషలలో మంచి గుర్తింపు ఉండడంతో దర్శకనిర్మాతలు అతన్ని సంప్రదించారు అని సమాచారం. గత శుక్రవారం విడుదలైన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, శర్వానంద్ కు మంచి విజయం అందించింది.
‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని సమాచారం. పివిపి సినిమాస్ పతాకంపై ఈ సినిమాను ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తారు.

