మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతన్న ‘శశివదనే’

మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతన్న ‘శశివదనే’

Published on Dec 13, 2025 12:00 AM IST

Sasivadane Movie Review

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘పలాస 1978’ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి, నటి కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, తాజాగా ఇప్పుడు ఈ చిత్రం మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్యూర్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. సాయి మోహన్‌ ఉబ్బర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మించారు. మరి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు