సత్యం రాజేష్ “టెనెంట్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్..

సత్యం రాజేష్ “టెనెంట్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్..

Published on Apr 13, 2024 10:06 AM IST

క్రేజీ థ్రిల్లర్ చిత్రం ‘పొలిమేర2’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ “టెనెంట్”. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో ప్రియదర్శి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

మరి ఈ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో ప్రియదర్శి మాట్లాడుతూ..”రాజేష్ అన్నకి ముందుగా హ్యాపీ బర్త్ డే. రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్ గా ఉంటున్నాడు రాజేష్ అన్న(నవ్వుతూ). నటుడిగా ఆయన ప్రయాణం, ట్రాన్స్ ఫర్మేషన్ స్ఫూర్తిదాయకం. ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ బాగా నచ్చింది. నిర్మాతలు చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి గారికి, దర్శకుడు యుగంధర్ గారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నిర్మాతల కళ్ళలో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్ధమౌతోంది. సినిమా ఆల్రెడీ హిట్. ఎక్కువ మంది ప్రేక్షకులకు టెనెంట్ సినిమా రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. కంటెంట్ చాలా కొత్తగా వుంది. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి” అని కోరారు.

అలాగే హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ…”దర్శకుడు యుగంధర్ గారు ‘టెనెంట్’ కథని ఎంత అద్భుతంగా చెప్పారో అంతే అద్భుతంగా సినిమాని తీశారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ లో కన్నీళ్లు వచ్చేశాయి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి చదువరి. ఆయన ఆలోచనలో ఉన్నతంగా నెక్స్ట్ జనరేషన్ గా వుంటాయి. ఈ సినిమాని చాలా ప్రేమించి చేశారు. తప్పకుండా ఇది ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చందన అద్భుతంగా నటించారు. ఎస్తెర్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. భరత్ చందు అనురాగ్ పోటాపోటీగా నటించారు. సాగర్ గారు చాలా చక్కని సంగీతం అందించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలౌతుంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా సినిమాని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

ఇక ఈ సినిమా దర్శకుడు వై.యుగంధర్ మాట్లాడుతూ..”ముందుగా సత్యం రాజేష్ గారికి హ్యాపీ బర్త్ డే. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతి ఇంట్లో మహిళలకు కనెక్ట్ అయ్యే కథ ఇది. మహిళలు చూస్తే తప్పకుండా చూడాలని అబ్బాయిలకి చెబుతారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అలాగే మా సహా నిర్మాతలకు ధన్యవాదాలు. కంపోజర్ సాహిత్య సాగర్, డీవోపీ జెమిన్ జోమ్ సపోర్ట్ వలనే ఈ సినిమా ఇంత బాగా చేయగలిగాను. సాగర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సత్యం రాజేష్ గారు చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఎస్తర్ గారు చాలా చక్కని సమన్వయంతో ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ సినిమాని చేశారు. భరత్,చందన పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా. ఎమోషన్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు” అని తెలిపారు..

ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ..”ఈ మధ్య కాలంలో నేను చేసిన మోస్ట్ ఎవైటెడ్ సినిమాలో ‘టెనెంట్’ ఒకటి. ఎవరడిగినా ఈ సినిమా గురించే చెబుతున్నాను. డైరెక్టర్ గారు ఇందులో నా పాత్రని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఆయన విజన్ అద్భుతంగా వుంది. డబ్బింగ్ చెప్పినప్పుడు నా పాత్ర ఇంకా నచ్చింది. మరింత నమ్మకం పెరిగింది.రాజేష్ గారితో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరిఆశీస్సులు కావాలి” అన్నారు.

అలాగే చందన మాట్లాడుతూ..”రాజేష్ గారితో కలసి ఈ సినిమా చేయడం, ఎన్నో విషయాలు నేర్చుకోవడం చాలా ఆనందంగా వుంది. ‘టెనెంట్’ మంచి మెసేజ్ ఒరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఏప్రిల్ 19న వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూసి మూవీ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపింది.

ఇక ఫైనల్ గా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘టెనెంట్’.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా. ఇందులో ఎమోషన్ అద్భుతంగా వుంటాయి. రాజేష్ గారు, ఎస్తర్ గారు నటీనటులంతా చాలా అద్భుతంగా నటించారు. యుగంధర్ గారు నిర్మాతల దర్శకుడు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు. ఈ విధంగా ఈవెంట్ అయితే అట్టహాసంగా ముగిసింది.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక వర్గం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: వై. యుగంధర్, నిర్మాత: మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, సహ నిర్మాత : రవీందర్ రెడ్డి .ఎన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ, సంగీతం : సాహిత్య సాగర్, సినెమాటోగ్రఫి : జెమిన్ జోమ్ అయ్యనేత్, ఎడిటర్: విజయ్ ముక్తవరపు, కథ: యస్ శ్రీనివాస వర్మ, కో-డైరెక్టర్: అనిల్ కడివేటి, స్టంట్స్: రబిన్ సుబ్బు, ఆర్ట్: కరకరల చంద్ర మౌళి, సాయి, ప్రొడక్షన్ కంట్రోలర్:బి. రాంబాబు, డిజిటల్ మీడియా : వినీత్-సందీప్, పిఆర్వో : తేజస్వి సజ్జా లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు