వెపన్.. ట్రెండ్ సెట్టర్ అవుతుంది – సత్యరాజ్

వెపన్.. ట్రెండ్ సెట్టర్ అవుతుంది – సత్యరాజ్

Published on May 30, 2024 9:18 PM IST

తమిళ సీనియర్ నటులు సత్యరాజ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెపన్’. దర్శకుడు ఎస్.గుహన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సూపర్ హ్యూమన్ అనే కాన్సెప్ట్‌తో రానుంది. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు టీమ్. కాగా, ఈ ట్రైలర్ లాంచ్‌లో చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ.. వెపన్ సినిమా భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ సినిమా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని ఆయన తెలిపారు.

మరో నటుడు వసంత్ రవి మాట్లాడుతూ.. సూపర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్‌ల మాదిరిగా ఈ సినిమా కూడా ఓ సూపర్ హీరో సినిమాగా నిలిచిపోతుందని అన్నారు. ఈ సినిమాలో సత్యరాజ్ చాలా సెటిల్డ్‌గా నటించారు అని తెలిపారు. ఈ సినిమా తమిళ్‌లో కంటే తెలుగులోనే బాగా ఆడుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా వసంత్ రవి పేర్కొన్నారు.

నటి తాన్యా హోప్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపింది. మూవీలోని మిగతా నటీనటులతో నటించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తాన్యా చెప్పుకొచ్చింది. దర్శకుడు గుహన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సత్యరాజ్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో చూడబోతున్నట్లుగా తెలిపారు. ఈ పాత్రను కేవలం ఆయన మాత్రమే పోషించగలరని సినిమా చూశాక ఆడియెన్స్ కూడా భావిస్తారు. ఇలాంటి గొప్ప సినిమాను తెరకెక్కించడంలో తమ నిర్మాతలు ఎంతో ప్రోత్సహించారని దర్శకుడు గుహన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను జూన్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు