సత్యరాజ్ ‘వెపన్’ ట్రైలర్.. ఇది ఆట కాదు.. వేట!

సత్యరాజ్ ‘వెపన్’ ట్రైలర్.. ఇది ఆట కాదు.. వేట!

Published on May 30, 2024 5:30 PM IST

తమిళ నటుడు సత్యరాజ్ తనదైన విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును పొందారు. ఆ తరువాత ఆయన చాలా తెలుగు చిత్రాల్లో మంచి పాత్రలు చేస్తూ వస్తున్నారు. కాగా, తమిళంలో ఆయన నటించిన ఓ కొత్త సినిమా జూన్ 7న రిలీజ్ కు రెడీ అయ్యింది. ‘వెపన్’ అనే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

దర్శకుడు ఎస్.గుహన్ తెరకెక్కించిన ఈ సూపర్ పవర్ ఫిక్షన్ మూవీలో సత్యరాజ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. స్వస్తిక్ రూపంలో ఉండే ఓ సూపర్ పవర్ ఆయన వద్ద ఉంటుంది. దీంతో దాన్ని చేజిక్కించుకునేందుకు జరిగే వార్‌నే మనకు ఈ సినిమాలో చూపెట్టబోతున్నట్లు ట్రైలర్ కట్‌లో రివీల్ చేశారు. ఈ క్రమంలో సత్యరాజ్ చేయబోయే యాక్షన్ ఎలా ఉంటుందనే శాంపిల్ కూడా మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. భారీ వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాలో వసంత్ రవి, రాజీవ్ మీనన్, తాన్య హోప్, రాజీవ్ పిళ్లై, యషిక ఆనంద్, మీమ్ గోపీ, కనిహ, గజరాజ్, సయెద్ సుభాన్ తదితరులు నటిస్తున్నారు. మిలియన్ స్టూడియో బ్యానర్‌పై ఎంఎస్.మంజూర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ కృష్ణ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు