వర్మ సెటైరికల్ మూవీ బాలీవుడ్ కి వెళ్లనుందా.?

వర్మ సెటైరికల్ మూవీ బాలీవుడ్ కి వెళ్లనుందా.?

Published on Jan 4, 2015 4:00 PM IST

ram-gopal-varma
ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిపై కొన్ని సెటైర్స్ లేదా కామెంట్స్ చేస్తూ వివాదాల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆలాంటి రామ్ గోపాల్ వర్మపై చేసిన సెటైరికల్ ఫిల్మ్ ‘అ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని అందుకుంది. అనుకున్న పాయింట్ ని రాకేష్ శ్రీనివాస్ సరిగా డీల్ చెయ్యలేకపోయాడు. కానీ ఈ సినిమాని హిందీలో రీమేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు.

అందులో భాగంగా ఇప్పటికే విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కి కథ చెప్పి సినిమా చేయడానికి ఒప్పించాడు. ఓ పాపులర్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించనున్నారు. తెలుగులో షఫీ ప్రధాన పాత్రలో నటించాడు. మరి తెలుగులో మెప్పించలేకపోయిన ఈ సినిమా హిందీలో ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తుందనేది చూడాలి.

తాజా వార్తలు