మహేష్, బన్నీ సినిమాలతో పోటీ లేదంటున్న డైరెక్టర్

Satish Vegesna

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమా కంటే ముందుగా 9న ‘దర్బార్’, 11న ‘సరిలేరు నీకెవ్వరు’, 12న ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు విడుదలకానున్నాయి. దీంతో ఈ చిన్న చిత్రం ఎంతవరకు పోటీని తట్టుకుంటుందో అనే అనుమానాలు మొదలయ్యాయి ప్రేక్షకుల్లో.

కానీ దర్శకుడు సతీష్ వేగేశ్న మాత్రం తమ సినిమాకు ఇతర సినిమాలతో పోటీయే లేదని అంటున్నారు. ఎందుకంటే తమది ఫ్యామిలీ జానర్ సినిమా కాబట్టి పండుగ సమయంలో తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ధీమాగా ఉన్నారు. 2017లో సైతం వేగేశ్న డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ జానర్ చిత్రం ‘శతమానం భవతి’ సంక్రాంతి సీజన్లోనై విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version