మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి విలక్షణ నటుల్లో సూపర్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఒకరు. అయితే సత్యదేవ్ ఇప్పుడు హీరోగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ ప్రయోగాత్మక చిత్రమే “రావు బహదూర్”. దర్శకుడు వెంకటేష్ మహాతో చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.
అయితే పలు కారణాలు చేత ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ జూన్ 5న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే సరిగ్గా దీనికి ముందే భారీ చిత్రం “టాక్సిక్” జూన్ 4 డేట్ తో సిద్ధంగా ఉంది.
మరి ఇలాంటి సినిమా ఉన్నప్పటికీ దీనిని అనౌన్స్ చేయడం మేకర్స్ తమ సినిమా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో అనేది అర్ధం చేసుకోవచ్చు. కేరాఫ్ కంచరపాలెం, సత్యదేవ్ తోనే ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో సత్తా చాటిన దర్శకుడుతో మరో సినిమా కావడంతో దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సో ఈ ఇంట్రెస్టింగ్ క్లాష్ లో ఏమవుతుందో చూడాలి.


