త్రిష ‘నాయకి’లో తెలుగు కమెడియన్ కీ రోల్

Sathyam-Rajesh
తెలుగు, తమిళ భాషల్లో స్టార్‍ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతోన్న త్రిష, తాజాగా ‘నాయకి’ పేరుతో ఓ తెలుగు, తమిళ భాషల్లో ఓ లేడీ ఓరియంటడ్ హర్రర్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి నెలాఖర్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటిసారిగా ఒక పూర్తి స్థాయి లేడీ ఓరియంటడ్ సినిమా చేస్తూండడంతో త్రిష, ‘నాయకి’పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

గోవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిషతో పాటు గణేష్ వెంకట్రామన్, సత్యం రాజేష్, జేపీ, మాధవి లత, సుష్మా రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సత్య రాజేష్ పాత్ర ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. తెలుగులో తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాలో త్రిషకు సమానమైన ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. గిరిధర్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ మంచి అంచనాలను పెంచాయి.

Exit mobile version