సత్యమేవ జయతే : పవన్ ఇమేజ్‌కు తగిన పాట

Published on Mar 3, 2021 7:16 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలోని ‘సత్యమేవ జయతే’ సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. విడుదలైన కాసేపట్లోనే పాట బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. టాప్ ట్రెండింగ్లో నిలిచింది. పాట విన్నాక సూపర్ హిట్ సాంగ్ అని అనుమానం లేకుండా చెప్పేలా ఉంది పాట. మొదటి సాంగ్ ‘మగువ మగువ’ ఎలాంటి హిట్ అయిందో ఇది కూడ అదే స్థాయి హిట్టవుతుందని అనొచ్చు. అభిమానులే కాదు ప్రేక్షకులంతా పాటకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.

ఇంతలా ఆకట్టుకోవడానికి ఆ పాటలో ఏముంది అంటే.. సాహిత్యమే. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యం పవన్ వ్యక్తిత్వానికి సరిగ్గా అతికినట్టు సరిపోయింది. నిజ జీవితంలో పవన్ ఎలా ఉంటాడో సవివరంగా చెప్పినట్టు ఉంది పాట. ‘జన జన జన జనగణమున కలగలిసిన జనం మనిషి రా, మన తరపున నిలబడగల నిజం మనిషి రా, పడి నలిగిలిన బ్రతుకులకొక బలమగు భుజం ఇవ్వగలడు రా, వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే’ లాంటి లైన్స్ పవన్ తత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అందుకే అభిమానులు పాటకు అంతలా కనెక్ట్ అయ్యారు.

ఒక్కోక లైన్ ఒక్కొక నిజంలా ఉందని రామజోగయ్యశాస్త్రిని అభినందిస్తున్నారు. ఇక శంకర్ మహదేవన్ గాత్రం, తమన్ సంగీతం పాటను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. మొత్తానికి పాట సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందనొచ్చు. అభిమానులైతే పవన్ కెరీర్లోని ఉత్తమమైన పాటల్లో ఇది కూడ ఒకటని కితాబిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :