‘బాహుబలి’ డైలాగ్స్ తో ప్రేమలో పడిన సత్యరాజ్

‘బాహుబలి’ డైలాగ్స్ తో ప్రేమలో పడిన సత్యరాజ్

Published on Nov 13, 2014 11:25 AM IST

bahubali_sathya
తమిళంలో బాగా ఫేమస్ అయిన స్టార్ హీరో సత్యరాజ్ ‘శౌర్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రభాస్ తో చేసిన ‘మిర్చి’ సినిమాతో తెలుగులో సత్యరాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సత్యరాజ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడు.ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్ బాహుబలి డైలాగ్స్ తో ప్రేమలో పడ్డానని అంటున్నాడు.

‘గతంలో నేను ఆడిషన్స్ కి వెళ్ళేప్పుడు పరాశక్తి, వీరపాండ్య కట్టబ్రహ్మన్న సినిమాలోని డైలాగ్స్ ని గుర్తు పెట్టుకొని వెళ్ళేవాడిని. అలాగే నా సినిమాలోని డైలాగ్స్ నాకు అస్సలు గుర్తుండవు. కానీ కార్కీ బాహుబలి కోసం రాసిన డైలాగ్స్ తో సూపర్బ్ చెప్పాలంటే ఆ డైలాగ్స్ తో ప్రేమలో పడ్డాను. బాగా ప్రాక్టీస్ చేసి మరి సీన్ చెయ్యడానికి వెళ్తున్నాను. ఈ సినిమా షూటింగ్ నేను ఎప్పటికీ మరచిపోలేను. అలాగే అఫీషియల్ గా నేను కార్కీకి ఫ్యాన్ అయిపోయానని’ సత్యరాజ్ అన్నాడు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది. అలాగే సుధీప్, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు