మార్చ్ లో ఈ డేట్ వరకు ఫ్రీ స్ట్రీమింగ్ కి “సేవ్ ది టైగర్”

మార్చ్ లో ఈ డేట్ వరకు ఫ్రీ స్ట్రీమింగ్ కి “సేవ్ ది టైగర్”

Published on Feb 28, 2024 1:31 PM IST


ప్రస్తుతం ఉన్న ఓటిటి ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో దాదాపు అన్ని ముఖ్య భాషలు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అనేక వెబ్ షో లు సినిమాలు అదిరే కంటెంట్ తో వస్తున్నాయి. అలా మన తెలుగు నుంచి కూడా పలు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో వచ్చి హిట్ అయ్యిన సిరీస్ లలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, అభినవ్ గోమఠం అలాగే చైతన్య కృష్ణ లు మెయిన్ లీడ్ లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫన్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్” కూడా ఒకటి.

మరి గత కొంత కాలం కితం డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పింది సీక్వెల్ ని కూడా లాక్ చేసుకుంది. అయితే ఈ సీక్వెల్ ని స్ట్రీమింగ్ కి తెచ్చే ముందు హాట్ స్టార్ వారు వీక్షకులకు మంచి ఆఫర్ అందించారు. ఈ మార్చ్ 10వ తేదీ వరకు కూడా ఫస్ట్ సీజన్ ని ఫ్రీ గా చూసే వెసులుబాటు కల్పించారు.

మరి ఇంకా ఈ సిరీస్ ని చూడని వారు ఎవరైనా ఉంటే ఈ సిరీస్ ని ఇప్పుడు ఫ్రీ గా హాట్ స్టార్ లో చూడవచ్చు. రీసెంట్ “యాత్ర 2” దర్శకుడు మహి వి రాఘవ్ అలాగే చిన్నా వాసుదేవ రెడ్డి ఈ సిరీస్ ని నిర్మాణం వహించగా తేజ కాకుమను దర్శకత్వం వహించాడు. అలాగే అతి త్వరలోనే మరింత ఎంటర్టైన్మెంట్ ని అందించే సీజన్ 2 ని తాము తీసుకురాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు