న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘సవ్యసాచి’ !

న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘సవ్యసాచి’ !

Published on May 14, 2018 11:04 AM IST

అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’ . రెండు నెలల పాటు ఇండియాలో షూటింగ్ జరుపిన చిత్ర యూనిట్ కీలక సన్నివేశాల చిత్రికరణ కోసం యూఎస్ వెళ్ళింది. ప్రస్తుతం న్యూయార్క్ లో హీరో హీరోయిన్ల పలు కీలక సన్నివేశాలిని, ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మాధవన్ , భూమికా చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ చిత్ర టీజర్ ను ఈ నెల చివరి వారంలో రీలీజ్ చేసి చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. ‘ప్రేమమ్’ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు