
‘టెంపర్’ సినిమా సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చాలా చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఈ సినిమా ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హిట్ అని అందించి వారి మదిలోని బాధని పోగొట్టింది. మొదటి వారంలో సుమారు 35కోట్ల షేర్ సాధించిన ఈ సినిమాకి సెకండ్ వీక్ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా టెంపర్ టీం నిన్న సక్సెస్ మీట్ చేసుకున్నారు.
ఈ వేడుకలో ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘చాలా సంవత్సరాల తర్వాత అభిమానుల కళ్ళలో ఆనందం చూసాను. ఈ సినిమా విజయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ సినిమా నా భాద్యతని మరింత పెంచింది. నేను కలెక్షన్స్ ని పట్టించుకోను, నేను కేవలం అభిమానుల ఆనందాన్ని మాత్రమే పట్టించుకుంటానని’ అన్నాడు. విడుదలైన అన్ని ఎరియాల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటున్న ఈ సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బండ్ల గణేష్ నిర్మించిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.