
అక్కినేని ఫ్యామిలీ నవతరం వారసుడు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమాలో అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేశా సైగల్ కూడా హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తన మొదటి సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే అప్పుడే టాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా మెగా ఫ్యామిలీ స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ సరసన కావడం విశేషం.
అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా సయేశా సైగల్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది. ప్రస్తుతం దానికి సంబందించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.