నిలిచిపోనున్న ‘రంగస్థలం’ ప్రదర్శన !

తమిళనాట నిర్మాతల మండలి డిజిటల్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న అధిక చార్జీలకు వ్యతిరేకంగా గత కొన్ని వారాలుగా థియేటర్లు మూసివేసి నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసన వలన చాలా చోట్ల థియేటర్లు మూతబడి చాలా కొత్త సినిమాల విడుదలలు వాయిదాపడ్డాయి.

ఈ నైపథ్యంలో గత శుక్రవారం విడుదలైన రామ్ చరణ్ ‘రంగస్థలం’ చెన్నై నగరంలో దిగ్విజయంగా నడుస్తోంది. ఇలా తమిళ సినిమాలు ఆగిపోయినా తెలుగు సినిమాలు విడుదలవుతుండటం నిరసనకు అంత మంచిది కాదని భావించిన నిర్మాతల మండలి తమిళనాట తెలుగు సినిమాల్ని సైతం నిలిపివేయాలని తెలుగు నిర్మాతల మండలిని కోరింది.

దీనిపై స్పందించిన తెలుగు నిర్మాతల మండలి తమిళనాడులో వచ్చే ఆదివారం నుండి ‘రంగస్థలం’తో పాటు అన్ని తెలుగు సినిమాల ప్రదర్శనను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మూలాన తమిళ చిత్ర పరిశ్రమ చేస్తున్న నిరసనకు మరింత బలం చేకూరినట్లైంది.