అఖిల్ 4 స్క్రిప్ట్ కంప్లీట్ !

Published on Feb 6, 2019 8:43 am IST


యువ హీరో అక్కినేని అఖిల్ తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మిస్టర్ మజ్ను కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఈ చిత్రం తరువాత అఖిల్ఈ సారి కూడా యంగ్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నాడు. ‘మలుపు’ ఫేమ్ సత్య తోఅఖిల్ నాల్గవ చిత్రాన్ని చేయనున్నాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. క్యాస్ట్ ఎంపిక చేసే పనిలో వున్నారు. మరిఅఖిల్ ఈచిత్రం తోనైనా హిట్ కొడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :