స్క్రిప్ట్ పనుల్లో ‘గూఢచారి 2’ !

Published on Dec 17, 2018 1:01 pm IST

‘క్షణం’ చిత్రంతో కెరిర్ లో మొదటి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్ ఇటీవల ‘గూఢచారి’ గా ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఇంటెన్సివ్ స్టోరీ తో అబ్బురపరిచే విజువల్స్ తో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సెన్సషనల్ హిట్ అయ్యింది. నూతన దర్శకుడు శశికిరణ్ టిక్కా తెరకెక్కించిన ఈ చిత్రంలో శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటించగా సుప్రియ యార్లగడ్డ ఒక ముఖ్య పాత్రలో నటించింది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో ‘గూఢచారి 2’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో వుంది. అయితే ఈ చిత్రాన్నీ గూఢచారి కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాహుల్ పాకాల తెరక్కించనున్నాడు.

అనిల్ సుంకర, వివేక్ కూచిబొట్ల , అభిషేక్ నామ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ స్పై థ్రిల్లర్ ను 2020 లో విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం :