‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వైవిధ్యమైన సినిమాల తర్వాత యువ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా ‘సూర్య vs సూర్య’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన పట్ల నిఖిల్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా కూడా వినూత్న కథాంశంతో రూపొందుతుంది. సినిమా టైటిల్ చూసి అందరూ నువ్వు డ్యూయల్ రోల్ చేస్తున్నావా..? అని అడుగుతున్నారు. డ్యూయల్ రోల్ చేయడం లేదు. సోలో హీరోగా నటిస్తున్నాను. అని చెప్పారు.
‘సూర్య vs సూర్య’లో పగటిపూట బయట తిరగలేని యువకుడిగా సూర్యగా కనిపిస్తాను. పగలు మాత్రమే బయట తిరగడాన్ని ఇష్టపడే అమ్మాయిని సూర్య ప్రేమిస్తాడు. వీరిద్దరూ ఎలా కలుసుకునేవారు..? మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అనేది మిగతా కథ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించాం. అని నిఖిల్ తెలిపారు.
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మిస్తున్నారు. మధుబాల, తనికెళ్ళ భరణి కీలక పాత్రలలో నటిస్తున్నారు.


