ఈ నెల 31న ‘సికిందర్’ ఆడియో విడుదల

ఈ నెల 31న ‘సికిందర్’ ఆడియో విడుదల

Published on Jul 9, 2014 10:20 PM IST

secendhar
సూర్య, సమంత జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అంజాన్’. తెలుగులో ‘సికందర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని రామ్‌లక్ష్మి సినీ క్రియేషన్స్‌, తిరుపతి బ్రదర్స్‌ పతాకాలపై శిరీషా-శ్రీధర్‌, ఎన్‌. సుభాష్‌చంద్రబోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటివల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తుంది. యుట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకూ కనిపించనంత సూపర్‌ స్టయిలిష్‌గా ‘సికందర్’లో సూర్య కనిపిస్తారు. సమంత గ్లామ్‌ర్‌ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం ఆడియోను జూలై 31న విడుదల చేస్తున్నట్టు నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలిపారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. గజిని చిత్రం తరహాలో ‘సికందర్’ చిత్రంలో లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సమంత కెరీర్లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని దర్శకుడు లింగుస్వామి అన్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషలో ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. తెలుగు సూర్యకు మంచి క్రేజ్ ఉండడంతో పాటు సమంత హీరోయిన్ కావడం వలన సినిమాపై ప్రేక్షకులలో క్రేజ్ ఏర్పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు