2024 సెకండ్ హాఫ్ : తెలుగు సినీ లవర్స్ కి కన్నుల పండగే

2024 సెకండ్ హాఫ్ : తెలుగు సినీ లవర్స్ కి కన్నుల పండగే

Published on Apr 17, 2024 11:00 PM IST

టాలీవుడ్ లో ఇప్పటికే గడచిన నాలుగు నెలల్లో పలు చిన్న, పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చి వారికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. మరోవైపు మరికొన్ని చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో పాటు స్టార్స్ నటించనున్న పాన్ ఇండియన్ సినిమాలు వేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.

ముందుగా ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనపడుతోంది. అనంతరం ఆగష్టు 15న పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక మూవీ పుష్ప 2 రిలీజ్ కానుంది. ఆపైన సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ పాన్ ఇండియన్ మూవీ ఓజి, ఆ తరువాత వెంటనే అక్టోబర్ 10న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర, ఇక చివరిగా అక్టోబర్ చివర్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీస్ రిలీజ్ కానున్నాయి.

ఇక వీటితో పాటు మరికొన్ని ఇతర చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాగా ట్రేడ్ అనలిస్టులు చెప్తున్న వివరాల ప్రకారం మొత్తంగా ఈ మూవీస్ అన్ని కలిపి రూ. 2500కోట్ల మేర బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దీనిని బట్టి రానున్న ఈ 2024 సెకండ్ హాఫ్ సినీ లవర్స్ కి మంచి కన్నుల పండుగను అందించనుందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు