విడుదలైన సెకండ్ హ్యాండ్ ఫస్ట్ లుక్

విడుదలైన సెకండ్ హ్యాండ్ ఫస్ట్ లుక్

Published on Mar 13, 2013 3:00 PM IST

Second-Hand
డైరెక్టర్ బివిఎస్ రవి నిర్మాతగా మారనున్నారు. ఈయన నిర్మాతగా ‘సెకండ్ హ్యాండ్’ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ ట్వీట్టర్ లో విడుదల చేశాడు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా, విడిపోయిన జంటల చుట్టూ తిరిగే స్టోరీతో తెరకెక్కనుందని సమాచారం. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధన్య బాలకృష్ణన్, సుదీర్ వర్మ, కిరీటి, అనూజ్రం, విష్ణులు నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి శిష్యుడు రవిచంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. బివిఎస్ రవి ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. తనకు సపోర్ట్ గా ఉంటూ, ప్రోత్సహిస్తున్న పురిజగన్నాథ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ పూరి జగన్నాథ్ గారికి కృతజ్ఞతలు, మీరు నా వెనక లేకుంటే ఇది సాద్యపడేది కాదు. మీరు నా వెనక ఉండడం నాకు ఎంతో బలంగా ఉందని’, ఆయన ట్వీట్ చేశాడు. అవనీంద్ర సినిమాటోగ్రాఫర్ గా, మహేష్ బాబు ‘ బిజినెస్ మాన్’ సినిమాకి ఎడిటర్ గా చేసిన ఎస్.అర్ శేఖర్ ఈ సినిమాకి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు