వరుణ్ తేజ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఖరారు ?

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్న సినిమాలో కావ్యా తాపర్ సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. మోడలింగ్ రంగం నుండి వచ్చిన ఈ అమ్మాయి వరుణ్ తేజ్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

అదితి రావ్ హైదరి ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా నటిస్తోంది. స్పేస్ నైపథ్యంలో జరిగే కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తి చెయ్యనున్నారు. ‘ఘాజి’ సినిమా తరువాత సంకల్ప్ రెడ్డి మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

Exit mobile version