సాయి శ్రీనివాస్ 5వ చిత్రంలో రెండవ హీరోయిన్ ఎవరంటే !

Published on Jul 7, 2018 12:08 pm IST


నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 5 వ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మొదటి హీరోయిన్ గా నటిస్తుంటే మెహ్రీన్ మరో కథానాయికగా నటించనుంది. వంశధార క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క హిందీ శాటిలైట్ హక్కులు రూ.9.50 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక సాయి శ్రీనివాస్ ఈ చిత్రం తరువాత తేజ దర్శకత్వంలో నటించనున్నాడు.

సంబంధిత సమాచారం :