కన్నడ సెన్సేషనల్ హీరో యష్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన నటిస్తున్న కే జి ఎఫ్ 2 చిత్రం లోని సెకండ్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్. చేతిలో ఆయుధంతో సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో ఉన్న యష్ అభిమానులలో కాకరేపుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. కే జి ఎఫ్ లోని బానిసలను సైనికులుగా మార్చుకొని తన సొంత రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వెళుతున్నట్టున్న యశ్ సినిమా పై ఆసక్తిపెంచేస్తున్నారు.
2018లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా కే జీ ఎఫ్ చాప్టర్ 2 విడుదల కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న కే జి ఎఫ్ 2 సమ్మర్ కానుకగా జులై లో విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోమబుల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు.


