“భారతీయుడు 2” సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్!

“భారతీయుడు 2” సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్!

Published on May 28, 2024 9:17 PM IST


యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భారతీయుడు 2. ఈ చిత్రం మొదటి పార్ట్ అయిన భారతీయుడు కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ను జూలై 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబందించిన సెకండ్ సింగిల్ ప్రోమో ను నేడు రిలీజ్ చేయడం జరిగింది.

చెంగలువ అంటూ సాగే ఈ ప్రోమో ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. హీరో సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఈ సాంగ్ లో అలరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి పాట రేపు ఉదయం 11:00 గంటలకు రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, బాబీ సింహా, ఎస్.జే సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు