చిల్ గా ఎంజాయ్ చేసేలా “నా సామిరంగ” నయా సాంగ్.!

చిల్ గా ఎంజాయ్ చేసేలా “నా సామిరంగ” నయా సాంగ్.!

Published on Jan 13, 2024 1:00 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ”. మరి నాగార్జునకి కలిసొచ్చిన సంక్రాంతి బరిలో అది కూడా పక్కా పల్లెటూరు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమా నుంచి మేకర్స్ అయితే మరో లేటెస్ట్ సాంగ్ ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

మరి సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ కింగ్ నాగ్ తన కాంబోలో ఓ పర్ఫెక్ట్ సాంగ్ అని చెప్పవచ్చు. నాగ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లతో కలిసి కనిపిస్తున్న ఈ సాంగ్ మంచి చిల్ మోడ్ లో ఎంజాయ్ చేసే విధంగా ఉందని చెప్పాలి. క్లీన్ బీట్స్ తో చంద్రబోస్ ఆకట్టుకునే సాహిత్యంతో మందు బాబులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

దీనితో థియేటర్స్ లో కూడా ఈ సాంగ్ మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించగా ఈ సంక్రాంతి కానుకగా రేపు జనవరి 14న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు